Chiranjeevi: ఓ బిజినెస్ మేన్ పుట్టినరోజుకు హాజరైన చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు

chiranjeevi nagarjuna mahesh babu meeting
  • ఓ ప్రముఖ వ్యాపారవేత్త బర్త్ డే పార్టీలో పాల్గొన్న చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు
  • సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ 
  • షూటింగ్స్‌కు కాస్త విరామం ఇచ్చి మాల్దీవుల్లో సరదాగా కాలక్షేపం చేసిన టాలీవుడ్ అగ్ర కథానాయకులు
టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు ముగ్గురూ కలిసి ఓ ఫంక్షన్‌లో పాల్గొన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్ర కథానాయకులు ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తుండటంతో ఆ హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే వీరు ముగ్గురూ ఎవరు ఏర్పాటు చేసిన ఫంక్షన్‌లో పాల్గొన్నారు? పార్టీ ఎక్కడ జరిగింది? అన్న వాటిపై చర్చ జరుగుతోంది. చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు మరి కొందరితో ఓ హోటల్‌లో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఉండటం ఆ ఫోటోలో కనిపిస్తుంది. 

అయితే, మాల్దీవులు వేదికగా ఓ వ్యాపార వేత్త తన పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ట్రీట్‌కు వీరంతా హాజరయ్యారని సమాచారం. ప్రస్తుతం 'విశ్వంభర' మూవీ షూటింగ్‌లో చిరంజీవి, కుబేర, కూలీ సినిమాల్లో నాగార్జున, రాజమౌళి దర్శకత్వంలోని చిత్రంలో మహేశ్ బాబు షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. షూటింగ్స్‌కు కాస్త విరామం ఇచ్చి వీరు సరదాగా మాల్దీవుల్లో గడిపారు.    
Chiranjeevi
Nagarjuna
Mahesh Babu
Movie News

More Telugu News