NASA: సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై స్పష్టత నిచ్చిన నాసా

nasa amid reports of sunita williams declining health
  • వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణించిందంటూ వదంతులు
  • సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ 
  • సునీతా విలియన్స్‌ సహా వ్యోమగాములందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పిన నాసా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియన్స్ బరువు తగ్గినట్లుగా, నీరసంగా ఉన్నట్లు కనిపించడం ఆందోళనకు గురి చేసింది. 

ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లనే ఆమె బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన శ్యాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని వచ్చిన వార్తలపై నాసా స్పందించింది. 
 
సునీతా విలియన్స్‌ సహా వ్యోమగాములందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని నాసా తెలిపింది. వ్యోమగాములకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతాయని, ఫ్లైట్ సర్జన్లు పర్యవేక్షిస్తారని వెల్లడించింది.  
 
 
NASA
Sunitha williams
international space center

More Telugu News