Bhumi Reddy: అసెంబ్లీకి రాని జగన్‌కు రాజకీయ పార్టీ ఎందుకు?.. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి సూటి ప్రశ్న

TDP MLC Bhumi Reddy Questions Over Jagan For Not Contests In MLC Elections

  • ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరెడ్డిని ప్రకటించి ఎందుకు వెనక్కి తగ్గారని భూమిరెడ్డి ప్రశ్న
  • జగన్ కోరుకునే బ్యాలెట్ పద్ధతిలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయన్న భూమిరెడ్డి
  • ప్రజా సమస్యలు పరిష్కరించలేని జగన్‌కు జీతం దండగన్న టీడీపీ ఎమ్మెల్సీ

ఎన్నికల్లో పాల్గొనని, అసెంబ్లీకి రాని జగన్‌కు రాజకీయ పార్టీ ఎందుకని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరెడ్డిని ప్రకటించి ఎందుకు వెనక్కి తగ్గారని జగన్‌ను నిలదీశారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్న ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని దుయ్యబట్టారు.

పులివెందులలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించలేని జగన్‌కు జీతమెందుకని భూమిరెడ్డి ప్రశ్నించారు. జగన్ వెంటనే తన పదవికి రాజీనామా చేస్తే పులివెందులకు మరో ఎమ్మెల్యే వస్తారని అన్నారు. జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల్లో అక్రమాలు ఎలా చేయాలో జగన్‌కు తెలిసినట్టు మరెవరికీ తెలియదని అన్నారు.

  • Loading...

More Telugu News