Drugs: డ్రగ్స్ కేసులో ఉగాండా మహిళకు 13 ఏళ్ల జైలు శిక్ష

Foreign women sentensed for 13 years in drugs case
  • హరారే నుంచి రూ.25 కోట్ల విలువ చేసే డ్రగ్స్ తీసుకొచ్చిన మహిళ
  • 2021 జూన్‌లో అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు
  • జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించిన కోర్టు
ఓ డ్రగ్స్ కేసులో ఉగాండా మహిళకు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టు 13 సంవత్సరాల శిక్ష విధించింది. పోలీసులు ఆమెను నాలుగేళ్ల క్రితం అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం ఆమెకు కోర్టు ఈ శిక్షను విధించింది. సదరు మహిళ హరారే నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకువచ్చింది. 2021 జూన్‌లో ఆమెను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.

ఆమె నుంచి డీఆర్ఐ అధికారులు 3.900 కిలోగ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ దాదాపు రూ.25 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు గుర్తించారు. కోర్టు... నిందితురాలికి పదమూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించింది.
Drugs
Telangana
Crime News

More Telugu News