Sukumar: సినిమా విడుదల కోసం నిద్రకు దూరమవుతున్న దర్శకుడు!

The director sleeps half an hour a day for the release of the film
  • డిసెంబర్‌ 5న రాబోతున్న ' పుష్ప-2 ది రూల్‌ '
  • సినిమా కోసం అహర్నిశలు శ్రమిస్తున్న దర్శకుడు 
  • అంచనాలు రీచ్‌ అవుతుందంటున్న మేకర్స్‌
ఒక గొప్ప చిత్రాన్ని ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని ప్రతి దర్శకుడు తపన పడుతుంటాడు. అందుకోసం కుటుంబం నుంచి దూరంగా, విలాసాల జోలికి పోకుండా సినిమా బెటర్‌ అవుట్‌పుట్‌ మీద దృష్టి అంతా ఉంటుంది.  ఇక పాన్‌ ఇండియా స్థాయిలో ఆకాశమే హద్దుగా విడుదల కాబోతున్న సినిమాలకు దర్శకుడు పెట్టే కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక సినిమా విడుదల ఇక దగ్గరికి వస్తుందన్నప్పుడు మాత్రం వాళ్లకు కంటి మీద కునుకు కూడా ఉండదు. 

ఇక సినిమానే గొప్పది... సినిమానే మనకు అంతా అని భావించే అరుదైన దర్శకుల్లో సుకుమార్‌ ఒకరు. మొదట్నుంచి కూడా సుకుమార్‌ ని అటు సినీ పరిశ్రమలోనూ.. ఇటు ప్రేక్షకులు 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్ 'అంటుంటారు. ఆయన తీసే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వుంటుంది. సినిమాలను లాజికల్‌గా, చిన్న చిన్న డిటైల్స్‌ కూడా వదలకుండా చిత్రాలను ఆయన తెరకెక్కిస్తుంటారు. ఆమధ్య ఆయన దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం, పుష్ప ది రైజ్‌ ఎంతటి ఘన విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ప్రస్తుతం ఈ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ దర్శకత్వంలో 'పుష్ప ది రైజ్‌' కు సీక్వెల్‌గా ' పుష్ప-2 ది రూల్‌ ' రూపొందుతోంది. ఈ చిత్రం కోసం ప్రపంచంలో సినీ ప్రేమికులు అంతా ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అనుకున్న తేదికి ఈ సినిమాను విడుదల చేయడం కోసం ' పుష్ప-2'  టీమ్‌ అంతా అహర్నిశలు శ్రమిస్తోంది. 

ముఖ్యంగా చిత్ర దర్శకుడు సుకుమార్‌ గత నెల రోజుల నుంచి ఓ వైపు చిత్రీకరణ.. మరో వైపు నిర్మాణానంతర పనులపై దృష్టి పెట్టాడు. మైన్యూట్‌ డిటైల్స్‌ కూడా వదలకుండా సినిమాలను రూపొందించే పనిలో ఉన్న ఆయనకు సరైన నిద్ర సైతం ఉండటం లేదని.. ఒక్కో రోజు అరగంట మాత్రమే నిద్రపోతున్నాడని తెలిసింది. 

పగలు చిత్రీకరణలో, నైట్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా వుంటూ సినిమా బెటర్‌ అవుట్‌పుట్‌ కోసం తన శాయశక్తుల కృషి చేస్తున్నాడని టాక్‌. సో.. 'పుష్ప-2 ది రూల్‌' గురించి అల్లు అర్జున్‌ అభిమానులు ఎంత ఊహించుకున్నా అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా సినిమా ఉండబోతుందని చిత్ర యూనిట్‌ నుంచి హింట్స్‌ కూడా వస్తున్నాయి. 
Sukumar
Pushpa
Pushpa2
Pushpa the rule
Allu Arjun
Rashmika Mandanna
Pushpa2 latest news

More Telugu News