Google Search: ట్రంప్ విజయంతో గూగుల్‌లో అమెరికన్లు ఎక్కువగా వెతికింది వీటినే!

 What America is searching on Google after Donald Trumps win

  • అబార్షన్, స్కాటిష్ సిటిజెన్‌షిప్, ఎల్‌జీబీటీక్యూ ప్లస్ హక్కులు వంటి వాటి విషయాలపై శోధన
  • పునరావాసానికి సంబంధించి 76 శాతం మంది వెతుకులాట
  • న్యూజిలాండ్, ఐర్లాండ్, కెనడా వంటి దేశాల గురించి కూడా శోధించిన అమెరికన్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాక గూగుల్ సెర్చ్ మోతెక్కి పోయింది. ట్రంప్ విజయం సాధిస్తున్నారని తెలియగానే అమెరికన్లు మొత్తం గూగుల్‌పై పడ్డారు. స్కాటిష్ సిటిజెన్‌షిప్, అబార్షన్, ఎల్‌జీబీటీక్యూ ప్లస్ ఇష్యూస్ ఇన్ స్కాట్లాండ్ వంటి విషయాలపై సెర్చ్ చేశారు. 

పునరావాసానికి సంబంధించి 76 శాతం మంది గూగుల్‌లో శోధించారు. మరీ ముఖ్యంగా ఒరెగావ్, కొలరాడో, వాషింగ్టన్, టెనస్సీ, మిన్నెసొటా వంటి రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఈ సెర్చ్ చేశారు. అలాగే, సరళమైన ఇమ్మిగ్రేషన్ విధానాలకు ప్రసిద్ధి చెందిన న్యూజిలాండ్, ఐర్లాండ్, కెనడా వంటి దేశాలను కూడా సెర్చ్ చేశారు. 

వీటితోపాటు ‘స్కాటిష్ సిటిజెన్‌షిప్’, ‘స్కాట్లాండ్‌లో అబార్షన్ చట్టబద్ధమేనా?’, ‘స్కాట్లాండ్‌లో ట్రాన్స్ (ట్రాన్స్‌జెండర్స్) హక్కులు’ వంటి విషయాలను తెలుసుకునేందుకు గూగుల్‌ను శోధించారు. ట్రంప్ అధికారంలోకి రావడంతో అబార్షన్, ఎల్‌జీబీటీ క్యూ ప్లస్ హక్కులకు సంబంధించిన విధానాల్లో మార్పులు తప్పవని భావిస్తున్న అమెరికన్లు వాటి కోసం వెతికారు. ట్రంప్ విజయం సాధించడంతో అమెరికన్లు వీటిని వెతకడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని ‘స్కాటిష్ గ్రీన్స్’ కో లీడర్ పాట్రిక్ హర్వీ పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News