Diwali Party: దీపావళి విందులో మందు, మాంసం.. యూకే ప్రధానిపై విమర్శలు

Meat And Alcohol At Diwali Party Hosted By UK PM Offends British Hindus
  • ఏటా దీపావళికి లండన్ లోని ప్రధాని నివాసంలో విందు
  • పద్నాలుగు ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం
  • ఏనాడూ ఇలా జరగలేదని మండిపడుతున్న హిందువులు
దీపావళి పండుగను భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలోని హిందువులు ఘనంగా జరుపుకున్నారు. అమెరికా, యూకే తదితర దేశాలలో అక్కడి హిందువులతో కలిసి అధ్యక్షులు, ప్రధానులు కూడా వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేకంగా తమ నివాసంలో హిందువులకు విందు ఇచ్చారు. బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్ కూడా దీపావళి నాడు హిందువులకు ప్రత్యేకంగా విందు ఇచ్చారు. పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు హాజరైన హిందువులు కూడా దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. వేడుకలు పూర్తయి విందుకు హాజరైన తర్వాత వారంతా నివ్వెరపోయారు. విందులో మందు, మాంసం వడ్డించడమే దీనికి కారణం. పండుగ నాడు మాంసాహారం వడ్డించడంపై వారు మండిపడుతున్నారు. ప్రధాని కీవ్ స్టార్మర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. గతేడాది అప్పటి ప్రధాని రిషి సునాక్ ఇచ్చిన దీపావళి విందులో శాఖాహార వంటకాలే తప్ప మాంసాహారం వడ్డించలేదని గుర్తుచేశారు.

గతేడాది మాత్రమే కాదు.. దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి యూకే ప్రధాని పీఠంపై ఎవరున్నా సరే ఏటా దీపావళి నాడు హిందువులకు విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని హిందూ కమ్యూనిటీకి చెందిన బ్రిటన్ పౌరుడు ఒకరు తెలిపారు. ఈ పద్నాలుగేళ్లలో ఏనాడూ దీపావళి విందులో మాంసాహారం చేర్చలేదని వివరించారు. విందు ఏర్పాటు విషయంలో సందేహాలుంటే హిందువులను సంప్రదించాల్సిందని, ఇది ముమ్మాటికీ ప్రధాని కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Diwali Party
UK PM
British Hindus
Meat
Alcohol

More Telugu News