Kasturi: పోలీసుల సమన్లు... ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన కస్తూరి

Actress Kasturi in deep troubles after her comments on Telugu people settled in Tamil Nadu
  • ఇటీవల తెలుగు వారిపై కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
  • చెన్నై, మధురై నగరాల్లో కేసులు నమోదు
  • నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులు
  • పరారీలో కస్తూరి!
ఇటీవల తెలుగు జాతి గురించి వ్యాఖ్యలు చేసి వివాదంలో  చిక్కుకున్న నటి కస్తూరి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కస్తూరిపై కేసులు నమోదు కాగా... పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు చెన్నైలోని ఆమె నివాసానికి వెళ్లారు. అయితే, అప్పటికే ఆమె ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్టు గుర్తించారు. కస్తూరి ఫోన్ కూడా స్విచాఫ్ అని వస్తున్నట్టు తెలిసింది. 

 కస్తూరి ఇటీవల తన సోదరుడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాదాపు మూడు శతాబ్దాల కిందట తమిళనాడు రాజుల అంతఃపురాల్లో స్త్రీలకు సేవలు చేసేందుకు తెలుగు వారు వచ్చారని, ఆ విధంగా వచ్చి ఇక్కడ స్థిరపడిన వారంతా... తమది తమిళ జాతి అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

కస్తూరి వ్యాఖ్యల ఫలితంగా చెన్నై, మధురై నగరాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, ఆమె తన న్యాయవాది ద్వారా ముందస్తు బెయిల్ కు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం.  
Kasturi
Actress
Telugu People
Police
Chennai
Tamil Nadu

More Telugu News