Samantha: షూటింగ్ పూర్తయిందని చెప్పగానే సమంత ఏడ్చేశారు: రాజ్ అండ్ డీకే

Raj and DK reveals Samantha cried during Family Man 2 web series shooting
  • రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్: హనీ బన్నీ
  • ప్రధానపాత్రలో సమంత
  • గతంలోనూ ఇదే కాంబోలో ఫ్యామిలీ మేన్-2
  • ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశం వెల్లడించిన రాజ్ అండ్ డీకే
దర్శకద్వయం రాజ్ అండ్ డీకే త్వరలోనే సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో సమంత ప్రధాన పాత్ర పోషించారు. గతంలో ఈ దర్శక జోడీతో ది ఫ్యామిలీ మేన్-2 వెబ్ సిరీస్ ను తెరకెక్కించింది. ఇందులో కూడా సమంత లీడ్ రోల్ పోషించారు. అప్పటి సంగతులను రాజ్ అండ్ డీకే తాజాగా పంచుకున్నారు. 

ఫ్యామిలీ మేన్-2 చిత్రీకరణ పూర్తయిపోయిందని చెప్పగానే సమంత ఏడ్చేశారని వెల్లడించారు. "షూటింగ్ అయిపోయిందా, ఇంకే ఏమైనా బ్యాలన్స్ ఉందా? అని సమంత మమ్మల్ని అడిగారు. ఇంకేమీ లేదు... షూటింగ్ కంప్లీట్ అయిందని చెప్పాం. దాంతో ఆమె చిన్నపిల్ల మాదిరిగా ఏడ్చేశారు. దాంతో మేమిద్దరం ఒకరి ముఖం ఒకరం చూసుకున్నాం. 

ఆమె ఎందుకు ఏడ్చిందా అని ఆలోచించాం. ఆమెను మేం చిత్రీకరణ సమయంలో బాగా ఇబ్బంది పెట్టామేమో అనిపించింది. ఫ్యామిలీ మేన్-2 చిత్రీకరణ సమయంలో సమంత మనోవేదనతో ఉన్న విషయం మాకు తెలియదు" అని రాజ్ అండ్ డీకే వివరించారు. 

Samantha
Raj and DK
The Family Man-2
Web Series
Citadel: Honey Bunny

More Telugu News