Mithya 2: పగ - ప్రతీకారాల మధ్య సాగే 'మిథ్య' సీజన్ 2'

Mithya 2 Update

  • గతంలో మెప్పించిన 'మిథ్య'
  • ప్రధాన పాత్రల్లో హుమా ఖురేషి - అవంతిక దాసాని  
  • ఈ నెల 1 నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్
  • ఫస్టు సీజన్ కి కొనసాగింపుగా నడిచే కథ  


హుమా ఖురేషి - అవంతిక దాసాని ప్రధాన పాత్రలుగా రూపొందిన 'మిథ్య' ఫస్టు సీజన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్టు సీజన్ లోని 6 ఎపిసోడ్స్ కూడా ఆసక్తికరమైన డ్రామాతో నడుస్తాయి. ప్రధానమైన రెండు పాత్రలు కూడా 'నువ్వా నేనా?' అన్నట్టుగా తలపడతాయి. ఎత్తుకు పయ్యెత్తులతో ఉత్కంఠను రేకెత్తిస్తాయి. అనూహ్యమైన ఒక సంఘటనతో ఫస్టు సీజన్ ముగుస్తుంది. ఆ తరువాత నుంచి సీజన్ 2 మొదలవుతుంది. సీజన్ 2ను కూడా 6 ఎపిసోడ్స్ గా అందించారు. 

ఈ నెల 1వ తేదీ నుంచి జీ 5లో సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సిరీస్ లో ఫస్టు సీజన్ కి రోహన్ సిప్పి దర్శకత్వం వహించాడు. సీజన్ 2కి కపిల్ శర్మ దర్శకత్వం వహించాడు. సీజన్ 2 అర్థం కావాలంటే సీజన్ 1లో ఏం జరిగిందో తెలుకోవలసిందే. ఎందుకంటే కథ ఫస్టు సీజన్ ను కలుపుకునే సాగుతూ ఉంటుంది. అందువలన ఫస్టు సీజన్ తరువాతనే సెకండ్ సీజన్ ఫాలో కావలసి ఉంటుంది. 

జుహీ (హుమా ఖురేషి) ఓ ప్రొఫెసర్. రియా (అవంతిక దాసాని) ఆమె స్టూడెంట్. మొదటి నుంచి కూడా రియా ప్రవర్తన కాస్త తేడాగా ఉండటాన్ని జుహీ గమనిస్తుంది. ముఖ్యంగా తన పట్ల ఆమె ఈర్ష్యా ద్వేషాలను కలిగి ఉండటాన్ని గ్రహిస్తుంది. తన భర్తతో రియా సంబంధం పెట్టుకోవడాన్ని జుహీ తట్టుకోలేకపోతుంది. ఆమె కారణంగా తాను భర్తను కోల్పోవలసి రావడాన్ని భరించలేకపోతుంది. ఆ నేరం విషయంలో శిక్షను అనుభవించిన రియా, మళ్లీ జుహీ జీవితంలోకి అడుగుపెట్టడంతో సీజన్ 2 మొదలవుతుంది. పర్యవసానంగా ఏం జరుగుతుందనేది మిగతా కథ. 

  • Loading...

More Telugu News