Vikarabad District: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసు... నిందితులకు రిమాండ్

Accused remanded in attack on Collector case

  • 55 మంది రైతులను సుదీర్ఘంగా విచారించిన పోలీసులు
  • 39 మంది రైతులను విడుదల చేసిన పోలీసులు
  • నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద దాడి కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. జిల్లాలోని లగచర్లలో నిన్న కలెక్టర్‌పై కొంతమంది రైతులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఫార్మా సిటీకి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌పై దాడి జరిగింది. ఈ కేసులో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు వారిని కొడంగల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం జడ్జి వారికి రిమాండ్ విధించారు.

నిన్న మొత్తం 55 మంది రైతులను పరిగి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత 39 మంది రైతులను విడుదల చేశారు. 16 మందిని మరింత లోతుగా విచారించి వైద్య పరీక్షలకు పంపించారు. ఇదిలా ఉండగా, ఈ దాడి ఘటనను తెలంగాణ పోలీస్ విభాగం తీవ్రంగా పరిగణిస్తోంది. అధికారులపై దాడి చేసిన వారితో పాటు గ్రామస్థులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేశ్‌ది బీఆర్ఎస్ పార్టీగా గుర్తించారు. మణికొండలో ఉండే అతను పక్కా ప్రణాళికతో లగచర్లకు వచ్చి... గ్రామస్థులను రెచ్చగొట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News