Group-2 Mains: ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా

APPSC postpones Group 2 Mains exams to Feb 23

  • తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 5న గ్రూప్-2 మెయిన్స్
  • పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం సరిపోదన్న అభ్యర్థులు
  • ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేసిన పలువురు ఎమ్మెల్సీలు
  • అందరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ
  • ఫిబ్రవరి 23కి గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా

ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వచ్చే ఏడాది జనవరి 5న జరగాల్సిన ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 23కి వాయిదా వేశారు. 

పరీక్ష తేదీ ప్రకటించినప్పటి నుంచి పరీక్ష నిర్వహించే తేదీ మధ్య కనీసం 90 రోజుల పాటు సమయం ఉండాలి. అయితే, ఈసారి ఆ సమయం 60 రోజులే ఉండడంతో, పరీక్షకు సన్నద్ధం కాలేమన్న ఆందోళన గ్రూప్-2 అభ్యర్థుల్లో వ్యక్తమైంది. దాంతో వారు ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ అనురాధను కలిసి, గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల తేదీని మార్చాలని, పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు తమకు మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

మరోవైపు, ఉత్తరాంధ్రకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు కూడా ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ ను కలిసి, మెయిన్స్ పరీక్షను మరికొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థుల తరఫున కోరారు. అదనంగా మరో 30 రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, పలువురు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఏపీపీఎస్సీకి ఇదే తరహా విజ్ఞప్తులు చేశారు. 

ఈ నేపథ్యంలో, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ అనురాధ గ్రూప్-2 మెయిన్స్ ను మరో తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈసారి గ్రూప్-2 ప్రిలిమ్స్ కు 4.04 లక్షల మంది హాజరుకాగా, 92 వేల మంది మెయిన్స్ కు అర్హత సాధించారు.

  • Loading...

More Telugu News