Heavy Rains: చెన్నైలో కుండపోత.. విద్యా సంస్థలకు సెలవు

Schools Shuts In Chennai Due To Heavy Rainfall

  • అల్పపీడన ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు
  • వారం రోజులపాటు కురుస్తాయన్న వాతావరణశాఖ
  • పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ

తమిళనాడు రాజధాని చెన్నై సహా పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కుండపోత వానల కారణంగా మయిలదుథురై, కరైకల్, పుదుచ్చేరిలలో స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడగా, కడలూర్, అయిలూర్, పెరంబలూర్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తీరప్రాంతాలైన చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూరు, కాంచీపురం, రాణిపేట్, కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెంకాశి, రామనాథపురం, విరుధునగర్, మదురై జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. 

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని 15కు పైగా జిల్లాల్లో ఈ వారమంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. వచ్చే రెండు రోజుల్లో చెన్నైలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News