Ponguleti Srinivas Reddy: కలెక్టర్‌పై దాడి వెనుక ఎవరున్నారో గుర్తించి చర్యలు తీసుకుంటాం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Minister Ponguleti Srinivas Reddy fires at Lagacharla issue
  • ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శ
  • నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామన్న మంత్రి
  • రైతుల పేరుతో కొంతమంది దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆగ్రహం
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై లగచర్లలో జరిగిన దాడి ఘటన వెనుక ఎవరు ఉన్నారో గుర్తించి తప్పకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి ఘటనల ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... దాడి ఘటనకు సంబంధించి నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు.

రైతుల పేరుతో కొంతమంది గులాబీ ముసుగు వేసుకొని దౌర్జన్యానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారో బయటకు రావాల్సి ఉందన్నారు. వికారాబాద్ ఘటన వెనుక ఉన్నది ఎవరో త్వరలో తేల్చుతామన్నారు.  ప్రజలకు మంచి చేద్దామని తాము భావిస్తే బద్నాం చేయాలనుకోవడం దారుణమన్నారు.
Ponguleti Srinivas Reddy
Congress
Telangana
BRS

More Telugu News