HYDRA: హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా కూల్చివేతలు
- రాంపల్లి సమీపంలోని రాజ్‌సుఖ్ నగర్‌లో కూల్చివేతలు
- రెండు బృందాలుగా విడిపోయి... జేసీబీలతో కూల్చివేతలు
- పదిహేనేళ్ల క్రితం రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న అధికారులు
హైడ్రా హైదరాబాద్ నగరంలో మరోసారి కూల్చివేతలు ప్రారంభించింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో రోడ్డును కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. రాంపల్లి సమీపంలోని రాజ్‌సుఖ్ నగర్ కాలనీలో ఈ కూల్చివేతలు చేపట్టింది. హైడ్రా అధికారులు జేసీబీతో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
పలువురు బిల్డర్లు పదిహేనేళ్ల క్రితం రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లుగా హైడ్రా గుర్తించింది. దీంతో రెండు బృందాలుగా విడిపోయి కూల్చివేతలు చేపడుతున్నారు. రాంపల్లి క్రాస్ రోడ్డుకు సమీపంలో రాజ్‌సుఖ్ నగర్ ఉంది. ఈ అక్రమ నిర్మాణాల కారణంగా స్థానికంగా ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ కూల్చివేతలకు సంబంధించి నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు.