YouTbuer: ఓ కుటుంబాన్ని బెదిరించి రూ. 70 వేలు తీసుకుంటుండగా యూట్యూబర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు

Hyderabad YouTuber caught redhanded extorting family

  • యూట్యూబ్‌లో న్యూస్ చానల్ నిర్వహిస్తున్న తన్వీర్ అహ్మద్
  • ఓ కుటుంబం వీడియోలను పోస్టు చేసి రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్
  • లాడ్జీలో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్న రెయిన్ బజార్ పోలీసులు

ఓ కుటుంబానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి డబ్బుల కోసం బెదిరిస్తున్న యూట్యూబర్‌ను హైదరాబాద్ రెయిన్‌ బజార్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు తన్వీర్ అహ్మద్ (54) యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో ఓ న్యూస్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఓ కుటుంబానికి సంబంధించి వీడియోను పోస్టు చేసిన తన్వీర్ ఆపై దానిని తన చానళ్ల నుంచి తొలగించాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని ఆ కుటుంబాన్ని డిమాండ్ చేశాడు. 

దీంతో బాధిత కుటుంబంలోని లతీఫ్ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో తన్వీర్ బాధిత కుటుంబ సభ్యుడితో ఓ ఒప్పందానికి వచ్చాడు. రూ. 70 వేలు ఇస్తే వీడియోలను డిలీట్ చేస్తానని చెప్పాడు. దీంతో అతడు చెప్పిన లాడ్జీకి డబ్బుతో వెళ్లాడు. అక్కడ అప్పటికే కాపు కాసిన పోలీసులు బాధిత యువకుడి నుంచి తన్వీర్‌ రూ. 70 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, తన్వీర్‌పై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News