RRR: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా రఘురామ ఎన్నిక

RaghuramakrishnaRaju Elected As Deputy Speaker Of AP Assembly



ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా ఉండి ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గురువారం సభలో ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకు ఆయన అభినందనలు తెలిపారు. 

అంతకుముందు ఎన్డీయే కూటమి తరఫున డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరును కూటమి నేతలు ప్రకటించారు. దీంతో కూటమి నేతలు సత్యకుమార్‌ యాదవ్‌, నాదెండ్ల మనోహర్‌తో పాటు మంత్రులు నారా లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు టీటీడీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులతో కలిసి రఘురామ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.

డిప్యూటీ స్పీకర్ పదవికి ఇతరులు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో గురువారం మధ్యాహ్నం స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ గా రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. కాగా, అసెంబ్లీలో చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో చీఫ్‌ విప్‌గా పంచుమర్తి అనురాధను నియమించిన విషయం తెలిసిందే.
RRR
AP Dy Speaker
Raghurama
AP Assembly
TDP
NDA Allianece

More Telugu News