Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజుకు శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy congratulates Raghu Rama Krishna Raju
  • ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకృష్ణరాజు
  • ఆశ్చర్యకరమైన రీతిలో రఘురామకు విషెస్ తెలిపిన విజయసాయి
  • పదవి ఔన్నత్యాన్ని నిలబెడతారన్న నమ్మకం ఉందంటూ ట్వీట్
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రఘురామకు ఆశ్చర్యకరమైన రీతిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి శుభాకాంక్షలు అందాయి. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కుర్చీ అధిష్ఠించబోతున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ శ్రీ రఘురామకృష్ణ రాజు గారూ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

"సభ హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని మీరు నిలబెడతారన్న నమ్మకం నాకుంది. గతంలో జరిగిన ఘటనలను గతానికే వదిలేసి, గతకాలపు నీడల నుంచి పైకి ఎదుగుతారని... తద్వారా గౌరవప్రదమైన పదవికి వన్నె తెస్తారని విశ్వసిస్తున్నాను" అంటూ విజయసాయి పేర్కొన్నారు.
Raghu Rama Krishna Raju
Deputy Speaker
Vijayasai Reddy
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News