AP Minister P Narayana: ప్రభుత్వ కళాశాలల విద్యార్ధులకు ఏపీ మంత్రి నారాయణ గుడ్ న్యూస్

minister narayana said that narayana group will provide support to students of government colleges to get quality education

  • ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపుకు మంత్రి సూచనలు  
  • కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ర్యాంకులు సాధించేలా అవసరమైన సహకారం అందిస్తామన్న నారాయణ
  • పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా నారాయణ గ్రూప్ నుంచి అందిస్తామని వెల్లడి 

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణ‌త‌ శాతం పెంపొందించేందుకు నారాయణ విద్యాసంస్థ‌ల నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా నారాయణ గ్రూప్ నుంచి అందిస్తామని అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు మంత్రి నారాయణ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలేజీలోని ఆడిటోరియంలో ఇంట‌ర్ బోర్డు గురువారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రి నారాయణ పాల్గొని అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్ట‌ర్ కృతికా శుక్లాతో పాటు రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, ఆర్‌ఐవోలు, జిల్లా ఒకేష‌న‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఆఫీస‌ర్లు, ఐదు రీజిన‌ల్ సెంట‌ర్ల‌లోని క‌ళాశాల‌ల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. 

ఇంటర్మీడియట్ విద్యార్థులను ఎలా చదివించాలి..? ర్యాంకుల సాధనకు ప్రణాళికలు ఎలా ఉండాలి..? పోటీ పరీక్షలను తట్టుకునేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను ఎలా పెంపొందించాలనే అంశాలపై మంత్రి నారాయణ అధ్యాపకులకు సూచనలు చేశారు. గ‌తేడాది ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల్లో విద్యార్ధులు సాధించిన మార్కుల‌ను అడిగి తెలుసుకున్న మంత్రి నారాయ‌ణ‌... మార్కులు త‌గ్గ‌డానికి గ‌ల కార‌ణాలేంట‌ని ఆరా తీసారు. ప‌ట్టుద‌ల ఉంటే సాధించ‌లేనిది ఏదీ లేద‌ని...దానికి త‌గ్గ‌ట్లుగానే విద్యార్ధుల‌కు అవ‌స‌ర‌మైన విధంగా విద్యాబోధ‌న చేయాల‌ని సూచించారు. ఈ ఏడాది ఈఏపీసెట్ రాసే విద్యార్ధుల‌కు నారాయ‌ణ విద్యాసంస్థ‌ల నుంచి కోచింగ్ మెటీరియ‌ల్ అందిస్తాన‌ని చెప్పారు. 

  • Loading...

More Telugu News