Dil-Luminati Concert: హైదరాబాద్‌లో నేడు దల్జీత్ దోసాంజ్ మ్యూజిక్ కన్సర్ట్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

Telangana Government Issues Notice to Diljit Dosanjh ahead of Hyderabad concert

  • డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ ప్రభుత్వం
  • మద్యం, డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా పాటలు పాడొద్దని ప్రభుత్వం ఆదేశాలు
  • మద్యం, డ్రగ్స్‌పై దోసాంజ్ కచేరీలో పాటలు సర్వసాధారణం
  • అంతర్జాతీయ వేదికలపైనా ఇవే పాటలు
  • సాక్ష్యాలు సమర్పించిన చండీగఢ్‌కు చెందిన పండిట్‌రావ్

ప్రముఖ గాయకుడు, నటుడు దల్జీజ్ దోసాంజ్ నేటి మ్యూజిక్ కచేరీపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దల్జీత్‌తోపాటు ‘దిల్-లుమినటి’ కచేరీ నిర్వాహకులకు నోటీసులు పంపింది. మద్యం, డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా ఎలాంటి పాటలు ఆలపించవద్దని ఆదేశించింది. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం అందులో భాగంగానే ఈ ఆదేశాలు జారీచేసింది. దోసాంజ్ మ్యూజిక్ కన్సర్ట్‌లో వీటిపై పాటలు సర్వసాధారణం కావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

దోసాంజ్ గతంలో డ్రగ్స్, మద్యంపై పాడిన పాటల వీడియో సాక్ష్యాలను చండీగఢ్‌కు చెందిన పండిట్‌రావ్ ధరేన్వర్ సమర్పించిన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం, జైపూర్‌తోపాటు పలు అంతర్జాతీయ వేదికలపైనా ‘దిల్ లుమినటి’ కన్సర్ట్‌లో దోసాంజ్ ఇలాంటి పాటలు ఆలపించాడు. 

పంజాబీ గాయకుడు అయిన దల్జీత్ దోసాంజ్ దిల్ లుమినటి టూర్ దేశవ్యాప్తంగా 11 నగరాల్లో గత నెల 26న ప్రారంభమైంది. అందులో భాగంగా నేడు హైదరాబాద్‌లో మూడో షో నిర్వహించనున్నాడు. ఈ కచేరీకి సంబంధించి టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి.

  • Loading...

More Telugu News