Dr Suneetha Reddy: కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిసిన వివేకా కుమార్తె డాక్టర్ సునీత

Viveka daughter Dr Suneetha Reddy met Kadapa SP Vidyasagar
  • వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ
  • తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీత
  • హంతకులకు శిక్ష పడేందుకు పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి
తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుదీర్ఘకాలంగా న్యాయం కోసం పోరాడుతున్న డాక్టర్ సునీతారెడ్డి నేడు కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిశారు. వివేకా హత్య కేసు గురించి ఎస్పీకి వివరించారు. వివేకా హంతకులకు శిక్ష పడేలా పోలీసులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి అభ్యంతరకర పోస్టులపైనా సునీత ఎస్పీతో చర్చించారు. అనంతరం, కడప నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. 

విద్యాసాగర్ కు ముందు కడప ఎస్పీగా వ్యవహరించిన హర్షవర్ధన్ రాజును కూడా సునీత గత ఆగస్టులో కలిశారు. మొదట హోంమంత్రి అనితను కలిసిన అనంతరం, సునీత అప్పటి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి తండ్రి హత్య అంశంపై మాట్లాడారు. 

కాగా, హోంమంత్రి అనితను కలిసిన సమయంలో... వివేకా హంతకులకు స్థానిక పోలీసుల అండ లభిస్తోందని సునీత ఆవేదన వెలిబుచ్చారు. సీబీఐ విచారణకు పోలీసుల సహకరించేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Dr Suneetha Reddy
SP Vidyasagar
Kadapa District
YS Viveka Murder Case

More Telugu News