IPL 2024: ఐపీఎల్ వేలంపై కీలక అప్‌డేట్... 81 మంది ఆటగాళ్ల కనీస ధర రూ.2 కోట్లు

IPL 2025 Auction with 574 Players

  • 1,574 మంది క్రికెటర్లు నమోదు చేసుకోగా 574 మంది షార్ట్ లిస్ట్
  • 366 మంది భారత్, 208 మంది విదేశీ ఆటగాళ్లు
  • 27 మంది ఆటగాళ్ల కనీస ధర రూ.1.50 కోట్లుగా నిర్ణయం

2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఐపీఎల్ వేలం కోసం 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా... 574 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ జాబితాను ఐపీఎల్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

మొత్తం 574 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేయగా, అందులో భారత ఆటగాళ్లు 366 మంది, విదేశీ ఆటగాళ్లు 208 మంది ఉన్నారు. ఇందులో భారత క్యాప్డ్ ప్లేయర్లు 48, విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు 193, భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్లు 318 మంది, విదేశీ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు 12, అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ముగ్గురు ఈ వేలంలో పాల్గొననున్నారు.

81 మంది ప్లేయర్ల కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించగా, 27 మంది ఆటగాళ్ల కనీస ధర రూ.1.50 కోట్లుగా నిర్ణయించారు. అత్యధికంగా 320 మంది ఆటగాళ్ల కనీస ధర రూ.30 లక్షలుగా నిర్ణయించారు. తొలి సెట్‌లో జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మిచెల్ స్టార్క్ తదితరులు ఉన్నారు. సెట్ 2లో యుజ్వేంద్ర చాహల్, డేవిడ్ మిల్లర్ తదితరులు, సెట్ 3లో రాహుల్ త్రిపాఠి ఉన్నారు.
ఇక్కడ క్లిక్ చేసి జాబితాను చూడండి

  • Loading...

More Telugu News