Chandrababu: తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న చంద్రబాబు

Chandrababu coming to Hyderabad after his brothers heath serious
  • హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామ్మూర్తినాయుడు
  • ఈరోజు పూర్తిగా విషమించిన ఆరోగ్యం
  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరుతున్నారు. ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్ లో పాల్గొని ఆయన హైదరాబాద్ కు బయల్దేరుతారు. మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకోనున్న చంద్రబాబు... శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా తన సోదరుడు చికిత్స పొందుతున్న ఏఐజీ ఆసుపత్రికి వెళ్తారు. 

వాస్తవానికి చంద్రబాబు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లి... ఎన్డీయే తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. కాసేపట్లో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
Chandrababu
Telugudesam
Ramamurthy Naidu

More Telugu News