Chandrababu: మా నుంచి దూరమై... మా కుటుంబంలో ఎంతో విషాదం నింపాడు: చంద్రబాబు

Chandrababu on his brothers death
  • తమ్ముడు రామ్మూర్తి పార్థివదేహాన్ని చూసి చలించిపోయిన చంద్రబాబు
  • తనను విడిచి వెళ్లిపోయాడంటూ ఆవేదన
  • పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని వ్యాఖ్య
తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు మరణంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాసేపటి క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు... తన తమ్ముడి పార్థివదేహానికి నివాళి అర్పించారు. నిర్జీవంగా ఉన్న తమ్ముడిని చూసి చలించిపోయారు. 

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... తమ్ముడు రామ్మూర్తినాయుడు తనను విడిచి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని చెప్పారు. ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని అన్నారు. తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 

మరోవైపు రామ్మూర్తినాయుడు భౌతికకాయాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నారావారిపల్లెలో రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్మూర్తి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu
Telugudesam
Ramamurthy Naidu

More Telugu News