SaurabhPrasad: లంచం తీసుకుంటూ దొరికిపోయిన రైల్వే ఉన్నతాధికారి

visakha drm saurabh caught red handed by cbi while taking bribe from contractor in mumbai
  • కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్
  • ముంబైలోని తన నివాసంలో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకున్న డీఆర్ఎం
  • విశాఖ డీఆర్ఎం బంగ్లాలో సోదాలు జరిపిన సీబీఐ అధికారులు
విశాఖ జిల్లా వాల్తేర్ రైల్వే డివిజన్ డీఆర్ఎంగా పనిచేస్తున్న సౌరబ్ ప్రసాద్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం సెలవులో ఉన్న సౌరభ్ ప్రసాద్ లంచం డబ్బును ముంబైలో తన ఇంటికి వచ్చి ఇవ్వాలని సూచించాడు. దాంతో కాంట్రాక్టర్ ముంబై వెళ్లి రూ.25 లక్షలు లంచం ఇస్తుండగా, సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

ఇదే క్రమంలో ఇటు విశాఖలోని డీఆర్ఎం బంగ్లాలో సీబీఐ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సీబీఐ సోదాలు జరిపింది. ఢిల్లీ, విశాఖకు చెందిన రెండు బృందాలు ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటూ దొరికిపోయిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
SaurabhPrasad
CBI
DRM
Indian Railways

More Telugu News