Revanth Reddy: కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy on record production of paddy in Telangana
  • వరి ఉత్పత్తిలో చరిత్ర సృష్టించిన తెలంగాణ
  • కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందన్న రేవంత్
  • ఇది తెలంగాణ రైతుల ఘనత అని కితాబు
దేశంలోనే వరి సాగు, ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్ ను అధిగమించి చరిత్ర సృష్టించింది. వానాకాలం సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 66.77 లక్షల విస్తీర్ణంలో వరిసాగు జరిగింది. ఏకంగా 153 లక్షల టన్నుల వరి ఉత్పత్తి జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

"కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరిసాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి, నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా... ఎన్డీఎస్ఏ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా... కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండింది. ఇది తెలంగాణ రైతుల ఘనత. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు" అని రేవంత్ ట్వీట్ చేశారు. 
Revanth Reddy
Congress
Kaleshwaram Project

More Telugu News