akkineni naga chaitanya: ఇండియన్ రేసింగ్ ఈవెంట్ లో నాగచైతన్య జట్టుకు టైటిల్

akkineni naga chaitanyas team won the f4 race title
  • కోయంబత్తూర్‌లో జరిగిన డామినెంట్ షోలో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అఖిల్ ఆలీఖాన్ 
  • ఎఫ్ -4 టైటిల్ గెలుచుకున్న హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ 
  • హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఫ్రాంచైజీ యజమానిగా ఉన్న అక్కినేని నాగచైతన్య
హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అఖిల్ ఆలీఖాన్ .. కోయంబత్తూర్‌లో ఆదివారం జరిగిన డామినెంట్ షోలో సత్తా చాటాడు. సినీ హీరో అక్కినేని నాగచైతన్యకు చెందిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఎఫ్ 4 రేస్ టైటిల్‌ గెలుచుకుంది. నాగ చైతన్య హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఫ్రాంచైజీ యజమానిగా ఉన్నారు. రేసర్ అఖిల్ ఆలీఖాన్ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ఛాంపియన్ షిప్‌ను కైవ‌సం చేసుకున్నాడు. 
 
గోవా ఏసెస్ జేఏ రేసింగ్‌లో రౌల్ హైమాన్, గాబ్రియేలా జిల్కోవాను అఖిల్ ఆలీఖాన్ ఓడించడంతో ఇండియన్ రేసింగ్ లీగ్ ఛాంపియన్ షిప్ గెలుపొందాడు. బెంగళూరుకు చెందిన రుహాన్ అల్వా (శాచి రార్ రాయల్ బెంగాల్ టైగర్స్) ఎఫ్ఐఏ – సర్టిఫైడ్ ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్ షిప్‌లో గ్రాండ్ డబుల్‌ను సాధించినప్పటికీ .. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టు యువకుడు అఖిల్ ఆలీఖాన్‌ను ఓడించలేకపోయాడు. దీంతో ఆల్వా ఛాంపియన్ షిప్‌లో రెండో స్థానంలో నిలిచాడు.   
akkineni naga chaitanya
f4 race
Coimbatore
hyderabad blackbirds

More Telugu News