delhi ncr: ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం... స్టేజ్-4 ఆంక్షలు

grap stage 4 restrictions to come into force from monday as pollution worsens in delhi ncr

  • దేశ రాజధాని ఢిలీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత 
  • నేటి నుండి మరి కొన్ని ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం 
  • తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ పాఠశాలల తరగతులు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సీఎం ఆదేశం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. 

ఢిల్లీ – ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) – 4 కింద మరిన్ని నిబంధనలను ఈ రోజు (సోమవారం,18వ తేదీ) నుండి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ రాత్రి 7 గంటల సమయానికి 457కి పెరుగుతోంది. దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఢిల్లీలోని పాఠశాలల్లో కేవలం ఆన్‌లైన్ తరగతులే నిర్వహించనున్నట్లు సీఎం అతిశీ ప్రకటించారు. 
 
నేటి నుండి అమలు అవుతున్న నిబందనలు ఇవి
*ఢిల్లీలోకి ట్రక్కుల (నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా) కు ప్రవేశాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్ – 4 డీజిల్ ట్రక్కులు మాత్రమే అనుమతి. ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వాహనాలపై నిషేధం. అయితే ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ బీఎస్ – 4 అంతకన్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశంపై నిషేధం.

*అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్‌లు, పైపులైన్‌లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను నిలిపివేస్తూ ఆదేశాలు.

*ఎన్ఆర్‌సీ ప్రాంతంలో కార్యాలయాలు అన్నీ 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సిఫార్సు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని సూచన.

*రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలను మూసివేయడంతో పాటు సరి బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సూచించింది. 
 

  • Loading...

More Telugu News