Telangana: ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఐఏఎస్ హరిచందన నియామకం

TG govt appointed Harichandana as RRR director
  • ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు విషయంలో ముందడుగు
  • దక్షిణ భాగం విషయంలో ప్రాజెక్టు కన్సల్టెంట్ నియామకానికీ అనుమతి
  • కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు చేపట్టేందుకు ఆర్ అండ్ బీకి అధికారం ఇస్తూ జీవో
తెలంగాణ ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారిణి హరిచందనను నియమించింది. తద్వారా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం విషయంలో ప్రాజెక్టు కన్సల్టెంట్ నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు చేపట్టేందుకు ఆర్ అండ్ బీకి అధికారం ఇస్తూ జీవో జారీ చేసింది. మరోవైపు, వరంగల్ భూగర్భ డ్రైనేజీ పథకానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రూ.4,170 కోట్లతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు.
Telangana
RRR
Congress
Hyderabad

More Telugu News