Vallabhaneni Vamsi: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు

Vallabhaneni Vamsi Aides Are Arrested In Connection With TDP Office Attack
   
కృష్ణా జిల్లా గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిచేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రంగాతోపాటు మరో ఇద్దరు ఉన్నట్టు తెలిసింది. 

గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయ ఆవరణలోని కారుకు నిప్పంటించి లోపల ఉన్న సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తాజాగా వంశీ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.
Vallabhaneni Vamsi
Gannavaram
TDP Office Attack

More Telugu News