New Delhi: ఢిల్లీ వాయు కాలుష్యం... గురుగ్రాం కంపెనీల కీలక నిర్ణయం

Work from home for employees of private firms in Gurugram
  • ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 500 దాటిన వాయు నాణ్యత సూచీ
  • వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చిన పలు ప్రైవేటు కంపెనీలు, కార్పోరేట్ సంస్థలు
  • తదుపరి ఆదేశాల వరకు వర్క్ ఫ్రమ్ హోం కొనసాగుతుందని స్పష్టీకరణ
దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో గురుగ్రాంలో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యతా సూచీ 500 మార్క్ దాటింది. ఈ క్రమంలో గురుగ్రాంలోని పలు ప్రైవేటు కంపెనీలు, కార్పోరేట్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగులు రేపటి నుంచి (బుధవారం) ఇంటి నుంచి పని చేసేలా ఆదేశాలు జారీ చేశాయి. తదుపరి ఆదేశాల వరకు వర్క్ ఫ్రమ్ హోం కొనసాగుతుందని పేర్కొన్నాయి.

వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలో ఆంక్షలు... పరిమితులు విధించారు. దీంతో ఢిల్లీలోని కోర్టుల్లో న్యాయవాదులు వర్చువల్‌గా పాల్గొని వాదనలు వినిపించవచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. స్కూళ్లలో పదో తరగతి వరకు ఆన్ లైన్ క్లాస్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు 50 శాతం ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని ప్రభుత్వం సూచించింది.
New Delhi
Pollution
Work From Home

More Telugu News