Air India: 80 గంటలుగా థాయ్‌లాండ్ విమానాశ్రయంలో ప్రయాణికుల నిరీక్షణ!

Over 100 AI passengers stranded in Thailand Phuket for over 80 hours due to technical faults
  • విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు
  • 16న థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం
  • టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్యతో నిలిచిన విమానం
విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో 100 మందికి పైగా ఎయిరిండియా ప్రయాణికులు థాయ్‌లాండ్‌లోని పుకెట్‌లో 80 గంటలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 16న థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీకి విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికి సాంకేతిక లోపం తలెత్తడంతో అక్కడే నిలిచిపోయింది. ప్రయాణికులు గంటల పాటు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. అలా 80 గంటలుగా వారు విమానాశ్రయంలోనే ఉండిపోయారు.

తాము ఇక్కడే గంటలుగా వేచి చూస్తున్నామని పలువురు ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తొలుత తాము ఆరు గంటల పాటు విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చిందని, ఆ తర్వాత విమానం సిద్ధంగా ఉందని తమను ఎక్కించారని, కానీ అంతలోనే మళ్లీ నిలిపేశారని తెలిపారు. అలా 80 గంటలుగా తాము విమానాశ్రయంలోనే ఉండిపోయామన్నారు. చిన్నారులు, పెద్దలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని పోస్ట్ చేశారు.

స్పందించిన ఎయిర్ లైన్స్ సంస్థ

ఈ సంఘటనపై ఎయిర్ లైన్స్ సంస్థ స్పందించింది. టేకాఫ్ అయ్యాక సాంకేతిక లోపం కారణంగా విమానం అత్యవసర ల్యాండింగ్ అయిందన్నారు. ప్రయాణికులకు తాము అన్ని వసతులు కల్పించామన్నారు. కొందరిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశామని, మరో 40 మంది ఇప్పటికీ పుకెట్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. మరికొన్ని గంటల్లో వారిని సురక్షితంగా పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
Air India
Thailand
Aeroplane

More Telugu News