Aryan Khan: ఎట్టకేలకు అరంగేట్రం చేస్తున్న షారుఖ్ ఖాన్ తనయుడు... కానీ...!

Shahrukh Khan son Aryan Khan takes mega phone for a web series
  • దర్శకుడిగా పరిచయం అవుతున్న ఆర్యన్ ఖాన్
  • నెట్ ఫ్లిక్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టయిన్ మెంట్ నిర్మాణంలో వెబ్ సిరీస్
  • వెబ్ సిరీస్ ద్వారా మెగా ఫోన్ పట్టుకుంటున్న షారుఖ్ తనయుడు
సినీ నటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్ల వారసులు చిత్ర రంగంలో ఎంట్రీ ఇవ్వడం సాధారణమైన విషయం. ముఖ్యంగా, హీరోల తనయులు దాదాపుగా హీరోలుగానే తెరంగేట్రం చేస్తుంటారు. అయితే, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాత్రం మేకప్ వేసుకునే బదులు మెగాఫోన్ పట్టుకుంటున్నాడు. 

ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నెట్ ఫ్లిక్స్, షారుఖ్ ఖాన్ సొంత ప్రొడక్షన్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టయిన్ మెంట్ కలిసి ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ కు 'స్టార్ డమ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వైపు వెళతాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చింది.

అతడు దర్శకత్వం వహించే వెబ్ సిరీస్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ వెబ్ సిరీస్ లో షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, బాబీ డియోల్ వంటి హేమాహేమీలు గెస్ట్ రోల్స్ పోషిస్తున్నారట. 

కాగా, తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా పరిచయం అవుతుండడాన్ని షారుఖ్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
Aryan Khan
Shahrukh Khan
Director
Web Series
Netflix
Red Chillies Entertainment
Bollywood

More Telugu News