Italy: ట్రంప్ గెలుపుతో బాధపడుతున్న అమెరికన్లకు రూ.84లకే ఇల్లు.. బంపరాఫర్ ప్రకటన

a village in Italy offers 1 dollar homes to Americans upset by Donald Trump Win in the US election 2024
  • అమెరికన్లకు ఆఫర్ ప్రకటించిన ఇటలీలోని ఒల్లోలై అనే గ్రామం
  • గ్రామంలో తగ్గిపోయిన జనాభా పునరుద్ధరణే లక్ష్యంగా ప్రకటన
  • ఖాళీగా ఉన్న ఇళ్లను విక్రయించేందుకు వెబ్‌సైట్ ప్రారంభం
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌పై అంచనాలకు మించి సీట్లు సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండవ దఫా ప్రభుత్వ పగ్గాలను జనవరి 20, 2025న ట్రంప్ చేపట్టనున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్‌ గెలుపుతో చాలా మంది అమెరికన్లు షాక్‌కు గురయ్యారు. ఆయన విజయాన్ని వారు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్ గెలుపుతో దుఃఖంలో మునిగిపోయిన అమెరికన్లకు ఇటలీలోని ఓ గ్రామం బంపరాఫర్ ప్రకటించింది.

ట్రంప్ గెలుపుతో బాధపడుతున్న అమెరికన్లకు కేవలం 1 డాలర్‌కే (సుమారు రూ.84.4) ఇల్లు విక్రయిస్తామని ఇటలీ ద్వీపం సర్డినియాలోని ఒల్లోలై అనే గ్రామం ప్రకటించింది. గ్రామంలో భారీగా తగ్గిపోయిన జనాభాను పునరుద్ధరించేందుకుగానూ బయటి వ్యక్తులు గ్రామంలో నివసించేలా ప్రోత్సహించాలని ఆ గ్రామం నిర్ణయించింది. ఈ దిశగా చాలా కాలంగా వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది. శిథిలావస్థకు చేరిన ఇళ్లను కేవలం ఒక డాలర్ కంటే తక్కువ రేటుకు కూడా విక్రయిస్తోంది. 

నవంబర్ 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితం వెలువడిన తర్వాత అమెరికన్లకు ఇళ్లు అమ్మేందుకు ఆ గ్రామం ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించిందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. ఖాళీగా ఉన్న ఇళ్లు త్వరగా అమ్ముడుపోవాలనే ఉద్దేశంతో మరింత చౌకగా గృహాలను అందుబాటులో ఉంచిందని తెలిపింది. ‘‘ప్రపంచ రాజకీయాలతో అలసిపోయారా? కొత్త అవకాశాలను వెతుకుతూ మరింత సమతుల్యమైన జీవనశైలిని స్వీకరించాలని భావిస్తున్నారా? అద్భుతమైన సర్డినియా స్వర్గంలో మీ జీవితాన్ని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం’’ అని వెబ్‌సైట్ పేర్కొంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికన్ ఓటర్లను ఆకర్షించేందుకు వెబ్‌సైట్ ప్రత్యేకంగా రూపొందించామని సర్డినియా మేయర్ ఫ్రాన్సిస్కో కొలంబు చెప్పారు. అమెరికాను తాను అభిమానిస్తున్నానని, తన కమ్యూనిటీ పునరుద్ధరణలో సహాయపడే ఉత్తమ వ్యక్తులు అమెరికన్లేనని నమ్ముతున్నానని చెప్పారు. ఇతర దేశాల వ్యక్తులు దరఖాస్తు చేయకుండా అడ్డుకోబోమని, అయితే అమెరికన్లు ఫాస్ట్ ట్రాక్ విధానాన్ని కలిగి ఉంటారని చెప్పారు.
Italy
USA
Donald Trump
US Presidential Polls
Viral News
Off beat News

More Telugu News