Maharashtra Polls: ఉదయాన్నే పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేసిన ప్రముఖులు.. ఫొటోలు ఇవిగో

Sachin And Sara Tendulkar Akshay Kumar Among Early Voters In Mumbai
--
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ముంబయిలో పోలింగ్ బూత్ లకు సెలబ్రెటీలు క్యూ కట్టారు. ఉదయాన్నే వచ్చి ఓటు వేసి వెళుతున్నారు. భారత రత్న, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి, కూతురు సారా టెండూల్కర్ బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం మనందరి బాధ్యత అని, ముంబైకర్లు అందరూ తప్పకుండా ఓటు వేయాలని సచిన్ కోరారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, సోనూ సూద్, ఫర్హాన్ అక్తర్, రితేశ్ దేశ్ ముఖ్, జెనీలియా తదితర సినీ ప్రముఖులు ముంబైలో ఓటు వేశారు. ఇటీవల హత్యకు గురైన నేత బాబా సిద్దిఖీ కుమారుడు జీశాన్ సిద్దిఖీ బాంద్రా ఈస్ట్ లోని ఓ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతిసారి తండ్రితో కలిసి ఓటు వేసేవాడిని, కానీ ఈసారి ఒంటరిగా వచ్చానంటూ జీశాన్ భావోద్వేగానికి గురయ్యారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రితేశ్ దేశ్ ముఖ్, జెనీలియా

సోనూ సూద్

ఫర్హాన్ అక్తర్

శక్తికాంత దాస్ దంపతులు

జీశాన్ సిద్దిఖీ
Maharashtra Polls
Sachin Tendulkar
Sara
Akshay
Sonu Sood

More Telugu News