Stock Market: అదానీ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- అదానీపై అమెరికాలో కేసు
- 20 శాతం పతనమైన అదానీ పోర్ట్స్ షేరు విలువ
- 580 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ గ్రూప్ పై అమెరికాలో కేసుతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 10.50 గంటల సమయంలో సెన్సెక్స్ 580 పాయింట్ల నష్టంతో 77,008 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 205 పాయింట్లు పతనమై 23,314 వద్ద కొనసాగుతోంది.
అదానీ పోర్ట్స్ షేరు విలువ 20 శాతం పతనమయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.04 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.82 శాతం పడిపోయాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.41 శాతం, టీసీఎస్ 0.87 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 0.80 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.