Bomb Cyclone: అమెరికాను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్ ఎంత భయంకరంగా ఉందో చూస్తారా?

An incredible view of the bomb cyclone here is viral video
  • భయంకరంగా సుడులు తిరుగుతున్న తుపాను
  • అమెరికా ప్రజలను భయపెడుతున్న భారీ వర్షాలు
  • ఆరు లక్షల ఇళ్లకు కరెంట్ కట్
  • పశ్చిమ, వాయవ్య అమెరికాలో దారుణ పరిస్థితులు
  • బ్రిటిష్ కొలంబియా, కెనడాపైనా తుపాను ప్రభావం
  • కెనడాలో 2.25 లక్షల ఇళ్లకు పవర్ కట్
అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’ ఉపగ్రహం కంటికి చిక్కింది. తుపాను తీవ్ర రూపం దాల్చుతూ పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి సమీపిస్తున్న అద్భుతమైన దృశ్యాన్ని ఉపగ్రహం చిత్రీకరించింది. తుపాను భయంకరంగా సుడులు తిరుగుతుండడం ఈ వీడియోలో కనిపించింది. తుపాను కారణంగా వాషింగ్టన్‌లోని లిన్‌వుడ్‌లో చెట్లు విరిగిపడడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 

భారీ వర్షాలు భయపెడుతుండగా, విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం ఆరు లక్షల ఇళ్లపై పడింది. వాషింగ్టన్, ఓరెగావ్, కాలిఫోర్నియాలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. స్కూళ్లు మూతపడ్డాయి. తుపాను కారణంగా పశ్చిమ, వాయవ్య  అమెరికాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బాంబ్ సైక్లోన్ ప్రభావం కెనడా, బ్రిటిష్ కొలంబియాపైనా పడింది. కెనడాలోని పసిఫిక్ తీర ప్రాంతంలో 2.25 లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
Bomb Cyclone
USA
Canda
British Colombia
Viral Video

More Telugu News