Ram pothineni: రామ్ పోతినేని-మహేష్‌బాబు.పి కాంబినేషన్‌ సినిమా ప్రారంభం

Ram Pothineni Mahesh Babu P combination movie launch
  • రామ్‌ 22వ చిత్రం ప్రారంభం 
  • క్లాప్‌ కొట్టిన హను రాఘవపూడి 
  • రామ్‌ సరసన నాయికగా భాగ్యశ్రీ బోర్సే
గత కొంతకాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తోన్న కథానాయకుడు రామ్‌ ఈసారి ఓ యువ దర్శకుడికి అవకాశమిచ్చాడు. ఇంతకు ముందు  రారా కృష్ణయ్య,  మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలను తెరకెక్కించిన మహేష్‌ బాబు.పితో రామ్‌ ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. 

రామ్‌ 22వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. రామ్‌ సరసన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే నాయికగా నటిస్తోంది. హీరో రామ్‌ పోతినేని, హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే మీద చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్‌ మలినేని కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్‌ నిచ్చారు. తొలిషాట్‌కు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. 

చిత్ర నిర్మాతలతో పాటు గోపీచంద్‌ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్‌ సాధినేని సంయుక్తంగా కలిసి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం రామ్‌ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన కసరత్తులు కూడా ఆయన ప్రారంభించారు. 

యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు.  

Ram pothineni
Mahesh Babu P
RAPO22
Bhagyashri Borse
Ram latest film
Cinema

More Telugu News