Game Changer: 'గేమ్‌ ఛేంజర్‌' చూస్తుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది: ఎస్‌జే సూర్య

Watching Game Changer dhimma thirigi bomma kanapadindhi SJ Surya
  • 'గేమ్‌ ఛేంజర్‌'పై హైప్‌ పెంచుతున్న సూర్య ట్వీట్‌ 
  •  పోతారు... మొత్తం పోతారు అంటూ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ 
  •  ఆ సన్నివేశాలకు మంచి అప్లాజ్‌ వస్తుందంటూ ప్రకటన
రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో 'దిల్‌'రాజు నిర్మిస్తున్న భారీ చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. కియారా అద్వానీ నాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులతో పాటు చిత్రీకరణ కూడా జరుపుకుంటోంది. జనవరి 10న రానున్న  సంక్రాంతికి చిత్రం విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రెండు యూనిట్‌లతో శరవేగంగా జరుపుతున్నారు. ఈ చిత్రంలో నటుడు ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. 

కాగా  గురువారం నాటికి తన డబ్బింగ్‌ను పూర్తిచేసుకున్న ఎస్‌జే సూర్య 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రంపై తన 'ఎక్స్‌ ' ఖాతా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

''రామ్‌చరణ్‌, శ్రీకాంత్‌ కాంబినేషన్‌లో నేను చేసిన రెండు సన్నివేశాలకు డబ్బింగ్‌ చెప్పడానికి మూడు రోజులు పూర్తిగా కేటాయించాను. ఇప్పుడు అవుట్‌పుట్‌ చూస్తుంటే దీనమ్మ దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఈ సన్నివేశాలకు థియేటర్‌లో పిచ్చి పిచ్చిగా అప్లాజ్ వస్తుంది. పోతారు మొత్తం పోతారు థియేటర్‌కి పోతారు... నాకు ఇలాంటి గొప్ప చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు శంకర్‌కు, దిల్‌ రాజుకు  కృతజ్క్షతలు తెలియజేస్తున్నాను. 'దిల్‌' రాజు గారికి ఇది ర్యాంపింగ్‌ సంక్రాంతిగా నిలుస్తుంది'' అంటూ 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రంను ఉద్దేశించి నటుడు ఎస్‌జే సూర్య ట్వీట్‌ చేశాడు. 

ఇది చూసిన మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రం విజయంపై ఈ ట్వీట్‌తో వారికి మరింత నమ్మకం పెరిగిందంటున్నారు. ఇటీవల లక్నోలో టీజర్‌ను విడుదల చేసిన 'గేమ్‌ ఛేంజర్‌' బృందం త్వరలోనే ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేయనున్నారు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌లు కూడా త్వరలో తెలియజేస్తారని సమాచారం. 
 
Game Changer
Ramcharan
Sj suryah
dil raju
Cinema
Game changer update

More Telugu News