Balakrishna: షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసు: బాల‌కృష్ణ

MLA Nandamuri Balakrishna Interesting Comments on YS Sharmila
  • గ‌న్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన బాల‌కృష్ణ‌
  • షర్మిల ఆరోపణలపై స్పందన
  • షర్మిలపై త‌ప్పుడు ప్ర‌చారాన్ని వారే పట్టించుకోనప్పుడు తానెందుకు పట్టించుకోవాలని వ్యాఖ్యలు
అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజరయ్యేందుకు టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాలకృష్ణ ఈరోజు ఉద‌యం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ స‌మ‌యంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న... ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుస‌ని అన్నారు. ఈ త‌ప్పుడు ప్ర‌చారాన్ని వారే పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

ఇదిలా ఉంటే... న‌టుడు ప్ర‌భాస్‌తో త‌న‌కు ఎలాంటి రిలేష‌న్ లేద‌ని తాజాగా మ‌రోసారి షర్మిల స్ప‌ష్టం చేశారు. త‌న పిల్ల‌లపై ప్ర‌మాణ‌పూర్వకంగా ప్ర‌భాస్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు. త‌న‌పై బాల‌కృష్ణ ఇంటి నుంచే త‌ప్పుడు ప్ర‌చారం జ‌రిగింద‌ని జగన్ చెప్పారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అలాగే, వైసీపీ వాళ్లు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారంటూ బాల‌య్య ఎద్దేవా చేశారు. ఇవాళ‌ కూడా వాళ్లు అసెంబ్లీకి రాకుంటే బాగుంటుంద‌ని తెలిపారు. 
Balakrishna
YS Sharmila
Andhra Pradesh

More Telugu News