Chandrababu: ఎవరొచ్చినా విజన్-2047 దెబ్బతినకుండా పునాది వేస్తున్నాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu talks about Vision Document 2047

  • విజన్ డాక్యుమెంట్-2047 పై ఏపీ అసెంబ్లీలో చర్చ
  • డబ్ల్యూ హెచ్ హెచ్ గురించి వివరించిన సీఎం చంద్రబాబు
  • రొటీన్ గా చేస్తే ఎక్కడ ఉంటామో అక్కడే ఉంటామని వ్యాఖ్యలు
  • నవ్య రీతిలో ముందుకెళ్లాలని సూచన

ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ డాక్యుమెంట్-2047పై చర్చ సందర్భంగా ప్రసంగించారు. గతంలో తాను విజన్-2020 తీసుకువచ్చానని, ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్-2047 తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ విజన్-2046 నినాదం డబ్ల్యూ హెచ్ హెచ్ (WHH) అని వెల్లడించారు. డబ్ల్యూ హెచ్ హెచ్ అంటే వెల్త్, హెల్త్, హ్యాపీనెస్ అని చంద్రబాబు వివరించారు.

భవిష్యత్తులో ఎవరు వచ్చినా విజన్ 2047 దెబ్బతినకుండా పునాది వేస్తున్నామని తెలిపారు. ఇక, పీ3 ఫార్ములాతో సమాజంలో సంపద సృష్టించడం సాధ్యపడిందని, పీ4 ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. రొటీన్ గా చేస్తే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటామని, నవ్య రీతిలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని చెప్పారు. 

ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర కోసం సీఎం చంద్రబాబు 10 సూత్రాలను ప్రకటించారు.

1. పేదరికం లేని సమాజం
2. ఉద్యోగాలు
3. నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి
4. నీటి వనరుల పరిరక్షణ
5. రైతులు-అగ్రి టెక్
6. గ్లోబల్, బెస్ట్ లాజిస్టిక్స్
7. విద్యుత్, ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ
8. ప్రొడక్ట్ పర్ఫెక్షన్
9. క్లీన్ ఆంధ్రప్రదేశ్
10. డీప్ టెక్

చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు...

•  స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి వందేళ్లు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ కూడా వికసిత్ భారత్-2047 విజన్ డాక్యుమెంట్ ప్రకటించారు.       మనం స్వర్ణాంధ్రప్రదేశ్ -2047తో ముందుకెళుతున్నాం. 
•   ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధికి విజన్ రూపొందించుకోవాలి. ప్రజలకు మీరు సేవ చేస్తే వారు మీతోనే ఉంటారు. 
•   స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్‌లో వెల్తీ, హెల్తీ, హ్యాపీ మూడింటికి ప్రాధాన్యం ఉంటుంది. 
•   సంపద సృష్టిస్తేనే వ్యక్తిగత, రాష్ట్ర ఆదాయం వస్తుంది. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలం. ఎవరికి ఇబ్బంది వచ్చినా పూర్తిగా ఆదుకునే బాధ్యత          తీసుకుంటాం. 
•   శాంతిభద్రతలు, ప్రశాంత వాతావరణం ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది. 
•   గ్లోబల్ థింకర్స్ గా తెలుగువారు ఉన్నారు. అతిపెద్ద 5వ ఆర్ధిక వ్యవస్థగా మన దేశం ఉంది. 2047కి అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉండేందుకు          వికసిత్ భారత్ విజన్‌ను ప్రధాని రూపొందించారు. 
•   రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే.. దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాలను దూరదృష్టితో ఆలోచిస్తుంది. 
•   ఇప్పటి వరకు 5 సార్లు ఈ విజన్ డాక్యుమెంట్ పై పారిశ్రామిక వేత్తలు, ప్రజలతో మాట్లాడాం. త్వరలోనే దీన్ని ప్రారంభిస్తాం. 
•   464 మండలాలు, 106 మున్సిపాలిటీలు, 1.18 కోట్ల మంది ప్రజలతో మాట్లాడి, 10,078 సమావేశాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యార్థులను            అందరినీ భాగస్వాములను చేశాం. మొత్తంగా 17 లక్షల మంది విజన్ కు వారి అభిప్రాయాలు తెలిపారు. 
•   అందులో 56 శాతం మంది మహిళలు స్పందించారు. 28 శాతం మంది విద్యార్థులు, యువత, 17 శాతం రైతులు, 5 శాతం సీనియర్ సిటిజన్స్            సూచనలు ఇచ్చారు. దేశంలో ఎన్నో విజన్లు తయారు చేశారు గానీ 17 లక్షల మంది భాగస్వాములు కావడం ఇదే ప్రథమం.  

  • Loading...

More Telugu News