Dolby Vision: ఇక మన వద్ద కూడా డాల్బీ విజన్ టెక్నాలజీ... నాగార్జున ఏమన్నారంటే...!

Nagarjuna said they have introduced Dolby Vision technology first time in India
  • దేశంలోనే మొట్టమొదటిసారిగా అన్నపూర్ణ స్టూడియోలో డాల్బీ విజన్ 
  • పుష్ప-2 చిత్రంతో ప్రారంభం
  • ఆనందంగా ఉందన్న నాగార్జున
అన్నపూర్ణ స్టూడియోస్ లో కొత్తగా డాల్బీ విజన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. డాల్బీ విజన్ టెక్నాలజీ... ఆడియన్స్ కు విభిన్నమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఇఫ్ఫీ సినీ వేడుకలో పాల్గొన్న టాలీవుడ్ కింగ్ నాగార్జున దీని గురించి మాట్లాడారు. 

దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డాల్బీ విజన్ టెక్నాలజీ సాయంతో తెరకెక్కించాలని భావించాడని, కానీ మన దేశంలో డాల్బీ విజన్ స్టూడియోలు లేకపోవడంతో ఆయన జర్మనీ వెళ్లి పనులు పూర్తి చేసుకున్నారని వివరించారు. ఇప్పుడు దేశంలో మొట్టమొదటిసారిగా డాల్బీ విజన్ టెక్నాలజీని తాము అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేశామని, పుష్ప 2 ది రూల్ చిత్రంతో ఈ సరికొత్త టెక్నాలజీని ప్రారంభిస్తున్నామని నాగార్జున చెప్పారు. 

ఈ వరల్డ్ క్లాస్ టెక్నాలజీని తొలిసారిగా తాము అందుబాటులోకి తీసుకువస్తుండడం సంతోషం కలిగిస్తోందని అన్నారు.  
Dolby Vision
Nagarjuna
Annapurna Studios
Hyderabad
Tollywood
India

More Telugu News