Tirumala: శ్రీవారి లడ్డూ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ప్రారంభం

sit initiated investigation into tirumala laddu adulterated ghee case

  • లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణకు దిగిన సిట్
  • శుక్రవారం తిరుపతికి చేరుకున్న సిట్ బృందం
  • తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సిట్‌కు తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశం తీవ్ర స్థాయిలో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సీబీఐ పర్యవేక్షణలో విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. 

తిరుపతికి శుక్రవారం సిట్ బృందం చేరుకుంది. నలుగురు డీఎస్పీలు, సీఐ, ఎస్ఐలతో కూడిన సిట్ బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించనుంది. ఈ క్రమంలో తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. కల్తీ నెయ్యి కేసులో సిట్ బృందం పూర్తి స్థాయి విచారణ జరిపి సీబీఐ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించనుంది. 
 
డీఎస్పీలు సీతారామాంజనేయులు, శివ నారాయణ స్వామి, కృష్ణమోహన్, వెంకట్రామయ్యలు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేయనున్నారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌తో పాటు తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరుకు పరిశీలించనున్నారు. అలాగే లడ్డూ తయారీలో పాల్గొనే శ్రీవైష్ణవులను సిట్ బృందం ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 

  • Loading...

More Telugu News