Maharashtra Results: ఇది ప్రజాతీర్పు కాదు.. మహారాష్ట్ర ఫలితాలపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు

MP Sanjay Raut Sensational Allegations On Maharashtra Results
  • ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలుస్తోందని ఎన్డీయేపై ఫైర్
  • లోక్ సభ ఎన్నికల్లో ఎంవీయే కూటమికే మెజార్టీ వచ్చిందన్న సంజయ్
  • షిండే వర్గం అభ్యర్థులంతా గెలవడంపై ఆశ్చర్యం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఫలితాల్లో ఎన్డీయే కూటమి లీడ్ లో దూసుకెళ్లడం, బీజేపీ ఒంటరిగానే వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రజాతీర్పు కాదని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఎన్డీయే గెలుస్తోందని మండిపడ్డారు. ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన అభ్యర్థులు అందరూ ఆధిక్యంలో కొనసాగడంపై సంజయ్ సందేహం వ్యక్తం చేశారు. బాల్ థాక్రే స్థాపించిన శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండేపై మరాఠా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.

అయినప్పటికీ షిండే వర్గం నేతలంతా ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. షిండే, అజిత్ పవార్ లపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, లోక్ సభ ఎన్నికల్లోనూ ఇది ప్రతిఫలించిందని గుర్తుచేశారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఎంవీయే కూటమికే పట్టం కట్టారని చెప్పారు. ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారని ఆరోపించారు.
Maharashtra Results
Assembly Polls
MVA
Shivasena MP
Sanjay Raut

More Telugu News