Harshit Rana: భార‌త పేస‌ర్ హ‌ర్షిత్ రాణాతో స్టార్క్ చిట్‌చాట్‌.. నీకంటే నేనే ఫాస్ట్‌గా బౌల్ చేస్తానంటూ క‌వ్వింపు చ‌ర్య‌లు!

Interesting Chitchat Between Harshit Rana and Mitchell Starc Video goes Viral
  • పెర్త్‌ టెస్టులో హ‌ర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ
  • రాణా నుంచి వేగంగా బంతులు ఎదుర్కొంటుండ‌టంతో అత‌నిపై స్టార్క్ స్లెడ్జింగ్‌
  • నెట్టింట వీడియో వైర‌ల్‌
బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ తొలి టెస్టులో హ‌ర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్ మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర సంభాష‌ణ తాలూకు వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. రాణా నుంచి వేగంగా బంతులు ఎదుర్కొంటుండ‌టంతో అత‌నిపై స్టార్క్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డాడు. రాణాను డిస్ట‌ర్బ్ చేసేందుకు ఆసీస్ ప్లేయ‌ర్ స్లెడ్జింగ్‌కు దిగాడు. 

30వ ఓవ‌ర్‌లో ఓ బంతి హెల్మెట్‌కు త‌గ‌ల‌డం, మ‌రోటి బౌన్స‌ర్ వేయ‌డంతో 'నీ కంటే నేనే స్పీడ్‌గా బంతులేయ‌గ‌ల‌ను. ఇది నేను గుర్తుంచుకుంటా' అని స్టార్క్ చెప్ప‌డం వీడియోలో ఉంది. కాగా, వీరిద్ద‌రూ ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌)కు ఆడారు. అందువ‌ల్లే ఇలా చ‌నువుగా ఉన్నార‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. 
Harshit Rana
Mitchell Starc
Team India
Perth Test
Cricket
Sports News

More Telugu News