Priyanka Gandhi: 2 లక్షలకు పైగా మెజార్టీలో ప్రియాంకాగాంధీ

Priyanka Gandhi in lead with more than 2 laks majority
  • వయనాడ్ ఉపఎన్నికలో పోటీ చేసిన ప్రియాంక
  • గతంలో 4.3 లక్షల మెజార్టీతో గెలుపొందిన రాహుల్
  • రాహుల్ రాజీనామాతో వయనాడ్ కు ఉపఎన్నిక
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆమె పోటీ చేశారు. ఎన్నికల ఫలితాల్లో ఆమె జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె 2 లక్షలకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికలో ప్రియాంకపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్, సీపీఐ అభ్యర్థి సత్య మొకేరి పోటీలో ఉన్నారు. 

2019 లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ స్థానం నుంచి రాహుల్ గాంధీ 4.3 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ 3.6 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. అయితే యూపీలోని రాయ్ బరేలీ స్థానం నుంచి కూడా గెలుపొందిన రాహుల్... వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక జరిగింది. ఈ స్థానంలో ప్రియాంక బరిలోకి దిగారు. నవంబర్ 13న ఈ స్థానంలో పోలింగ్ జరిగింది.
Priyanka Gandhi
Wayanad

More Telugu News