T Congress: ‘బీఆర్ఎస్ ప్రచారానికి ఇది చెంప పెట్టు’ అంటూ కాంగ్రెస్ ట్వీట్

Telangana Congress Party Tweet On Real Estate Growth In Hyderabad

  • కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న ప్రచారంపై స్పందన
  • అన్ రాక్ విశ్లేషణకు సంబంధించిన రిపోర్ట్ ను పోస్ట్ చేసిన టీ కాంగ్రెస్
  • బీఆర్ఎస్ దుర్నీతికి ఇదే నిదర్శనమంటూ మండిపాటు

కాంగ్రెస్ పార్టీ పాలనలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ అధికార పార్టీ మండిపడింది. రాష్ట్రంలో.. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా పురోభివృద్ధి సాధించిందని పేర్కొంది. తాజాగా ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ అన్ రాక్ వెలువరించిన రిపోర్టే దీనికి నిదర్శనమని, అదేవిధంగా బీఆర్ఎస్ దుర్నీతికి కూడా ఇదే నిదర్శనమని చెప్పింది. ఈమేరకు తెలంగాణ అధికార పార్టీ శనివారం ట్వీట్ చేసింది. అన్ రాక్ కంపెనీ విశ్లేషణలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ లను జతచేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. 

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2023-2024 ఏడాది ప్రథమార్థంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2024-2025 మొదటి ఆరు నెలల్లో ఇళ్ల ధరలు 37% పెరిగాయని అన్ రాక్ విశ్లేషించించిందని కాంగ్రెస్ తెలిపింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని బీఆర్ఎస్ కాలకేయులు చేస్తున్న ప్రచారానికి అన్ రాక్ నివేదిక చెంపపెట్టు అని ఘాటుగా విమర్శించింది. గడచిన ఆరు నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ నగర స్థిరాస్తి మార్కెట్ బలమైన వృద్ధిని కనబరిచిందని అన్ రాక్ పేర్కొనట్లు తెలిపింది. రాజకీయ ఈర్ష్యతో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం బీఆర్ఎస్ దుర్నీతికి నిదర్శనం అని తెలంగాణ కాంగ్రెస్ మండిపడింది.

  • Loading...

More Telugu News