Priyanka Gandhi: నా గెలుపు మీ విజయమే: ప్రియాంకాగాంధీ

Priyanka Gandhi response after her win
  • వయనాడ్ లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందిన ప్రియాంక
  • వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ప్రియాంక
  • పార్లమెంట్ లో వయనాడ్ గొంతుకనవుతానని వ్యాఖ్య
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ తన తొలి ఎన్నికల సమరంలోనే ఘన విజయాన్ని అందుకున్నారు. వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికలో 4,08,036 ఓట్ల మెజార్టీతో ఆమె అద్భుత విజయాన్ని సాధించారు. 

తన విజయంపై ప్రియాంక స్పందిస్తూ... వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. మీరు నాపై ఉంచిన నమ్మకానికి ఎంతో సంతోషిస్తున్నానని చెప్పారు. ఈ విజయం మీదేనని అన్నారు. పార్లమెంట్ లో మీ గొంతుకనవుతానని... వయనాడ్ గళం వినిపించేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.  

మరోవైపు సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో, సోమవారమే ఎంపీగా ప్రియాంకాగాంధీ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. 

తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి లోక్ సభలోకి ప్రవేశించి... ఎంపీగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నట్టు సమాచారం. గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లో ఉండటం గమనార్హం. ఇప్పటికే రాహుల్ గాంధీ లోక్ సభలో, సోనియాగాంధీ రాజ్యసభలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక లోక్ సభలోకి అడుగుపెట్టబోతున్నారు.
Priyanka Gandhi
Congress

More Telugu News