Tirupati: ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య

youngster commits suicide by hanging himself in rtc bus
  • రేణిగుంట వద్ద గుర్తించిన బస్సు కండక్టర్
  • ఘటన జరిగిన సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణీకులు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రేణిగుంట పోలీసులు
ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే రేణిగుంట వద్ద కండక్టర్ దీన్ని గుర్తించాడు.

బస్సులో చివరి సీటు వద్ద హ్యాంగర్‌కు యువకుడు ఉరి వేసుకుని చనిపోయాడు. ఇది గమనించి కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే ఉన్నారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే మృతి చెందిన యువకుడి వివరాలు మాత్రం ఇంత వరకూ తెలియరాలేదు. 
Tirupati
suicide
youngster
Crime News

More Telugu News