Abhishek Bachchan: ఐశ్వర్యరాయ్‌తో విడాకుల వార్తలపై మౌనం వీడిన అభిషేక్ బచ్చన్

Abhishek Bachchan on handling negativity amid divorce rumours with Aishwarya Rai
  • ఐశ్వర్యరాయ్‌-అభిషేక్ విడిపోబోతున్నారంటూ కొంతకాలంగా వార్తలు
  • కుమార్తె బర్త్ డేకు కూడా హాజరు కాని అభిషేక్
  • ప్రతికూల వార్తలను తాను పట్టించుకోబోనని తేల్చి చెప్పిన నటుడు
  • చెడు తన చెడును వదులుకోనప్పుడు, మంచి తన మంచిని ఎందుకు వదులుకోవాలని ప్రశ్న
నటి ఐశ్వర్యరాయ్‌, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. నటి నిమ్రిత్‌కౌర్‌తో అభిషేక్ ఎఫైర్ కారణంగా ఐశ్వర్యతో విడిపోతున్నట్టు వార్తలొచ్చాయి. దీనికితోడు కుమార్తె ఆరాధ్య బర్త్ డే వేడుకలకు కూడా అభిషేక్ హాజరు కాకపోవడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. అయినప్పటికీ అటు ఐశ్వర్య కానీ, ఇటు అభిషేక్ కానీ బహిరంగంగా ఎప్పుడూ బయటపడలేదు. 

తన చుట్టూ అల్లుకున్న ఈ వార్తలపై అభిషేక్ తాజాగా స్పందించారు. విడాకుల వార్తలపై పరోక్షంగా స్పందించాడు. ప్రతికూల వార్తలను తాను పట్టించుకోబోనని తేల్చి చెప్పాడు. ‘ఈటీ టైమ్స్’తో మాట్లాడుతూ.. వ్యక్తిత్వంలో, మూలసిద్ధాంతంలో మనిషిగా మనం మారకూడదని, కానీ స్వీకరించడం, అభివృద్ధి చెందడాన్ని నేర్చుకోవాలని పేర్కొన్నాడు. లేదంటే వెనకబడిపోతామని చెప్పాడు. చెడు తన చెడును వదులుకోనప్పుడు.. మంచి మాత్రం తన మంచిని ఎందుకు వదులుకోవాలని ప్రశ్నిస్తూ పరోక్షంగా విడాకుల వార్తలను తప్పుబట్టాడు.

తాను చాలా సానుకూల వ్యక్తినని, ప్రతికూలతలపై దృష్టి పెడితే అది మిమ్మల్ని కబళిస్తుందని పేర్కొన్నాడు. మనిషిగా మీరెవరు? ఎందుకు కోసం ఉన్నారు? అనేది తెలుసుకోవాలని, నేను గాలికి ఆకులా కొట్టుకుపోతానంటే అతడు అంత గొప్పవాడు అనిపించుకోడని తెలిపాడు. అందుకనే తనలోని కొన్ని విషయాలు ఎప్పటికీ మారబోవని తేల్చి చెప్పాడు. మేఘంలోని వెండిరేఖను చూసినప్పుడో, సూర్యరశ్మిని చూసినప్పుడో దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే అది మన జీవితాన్ని కొనసాగించేందుకు ప్రేరణ ఇస్తుందని అభిషేక్ చెప్పుకొచ్చాడు. 
Abhishek Bachchan
Aishwarya Rai
Bollywood
Divorce News

More Telugu News